Share News

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-11-20T00:30:36+05:30 IST

శబరిమలలో మండల పూజోత్సవం ప్రారంభం కానుండటంతో యాత్రికుల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను గుంటూరు, తెనాలి మీదగా నడపనున్నట్లు ప్రకటించింది.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

గుంటూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): శబరిమలలో మండల పూజోత్సవం ప్రారంభం కానుండటంతో యాత్రికుల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను గుంటూరు, తెనాలి మీదగా నడపనున్నట్లు ప్రకటించింది. గుంటూరు మీదగా ప్రయాణించే రైళ్లకు నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, చీరాలలోనూ నిలుపుదల ఉంది. తెనాలి మీదగా(మెయిన లైనలో) ప్రయాణించేవి బాపట్ల, చీరాలలో నిలుపుదల ఉంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి కొల్లం, నరసాపూర్‌ నుంచి కొట్టాయం, కాచిగూడ నుంచి కొల్లంకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతాయి. రెగ్యులర్‌ రైలు అయిన శబరి ఎక్స్‌ప్రెస్‌లో సంక్రాంతి పండుగ అయిపోయేంత వరకు స్లీపర్‌, ఏసీ క్లాస్‌లలో బెర్తులన్నీ రిజర్వు అయిపోయిన నేపథ్యంలో ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని డీఆర్‌ఎం రామకృష్ణ ఆదివారం తెలిపారు.

  • నెంబరు.07129 సికింద్రాబాద్‌ - కొల్లం రైలు ఈ నెల 26, డిసెంబరు 3(ఆదివారం) తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.15కి గుంటూరు, సోమవారం రాత్రి 11.55కి కొల్లం చేరుకొంటుంది. నెంబరు.07130 కొల్లం - సికింద్రాబాద్‌ రైలు ఈ నెల 28, డిసెంబరు 5 తేదీల్లో(మంగళవారం) వేకువజామున 2.30కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.40కి గుంటూరు, బుధవారం ఉదయం 8.55 సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

  • నెంబరు. 07119 నరసాపూర్‌ - కొట్టాయం రైలు నవంబరు 26, డిసెంబరు 3 తేదీల్లో(ఆదివారం) మధ్యాహ్నం 3.50కి బయలుదేరి రాత్రి 7.49కి తెనాలి సోమవారం సాయంత్రం 4.50కి కొట్టాయం చేరుకొంటుంది. నెంబరు.07120 కొట్టాయం - నరసాపూర్‌ రైలు ఈ నెల 27, డిసెంబరు 4 తేదీల్లో(సోమవారం) రాత్రి 7 గంటలకు బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.20కి తెనాలి, రాత్రి 9 గంటలకు నరసాపూర్‌ చేరుకొంటుంది. నెంబరు.07125 కాకినాడ టౌన - కొట్టాయం రైలు నవంబరు 23, 30 తేదీల్లో(గురువారం) సాయంత్రం 5.40కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.05కి తెనాలి, శుక్రవారం రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకొంటుంది. నెంబరు.07126 కొట్టాయం - కాకినాడ టౌన నవంబరు 25, డిసెంబరు 2(శనివారం) ప్రారంభ గడియల్లో 12.30కి బయలుదేరి రాత్రి 7.50కి తెనాలి, ఆదివారం వేకువజామున 4 గంటలకు కాకినాడ టౌనకు చేరుకుంటుంది.

  • నెంబరు.07123 కాచీగూడ - కొల్లం రైలు ఈ నెల 22, 29, డిసెంబరు 3 తేదీల్లో(బుధవారం) సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11.30కి గుంటూరు, గురువారం రాత్రి 11.55కి కొల్లం చేరుకొంటుంది. నెంబరు.07124 కొల్లం - కాచీగూడ రైలు నవంబరు 24, డిసెంబరు 1, 8 తేదీల్లో(శుక్రవారం) వేకువజామునకు ముందు 2.30కి బయలుదేరి శనివారం వేకువజామున 3.05కి గుంటూరు, ఉదయం 10.30కి కాచిగూడ చేరుకుంటుంది.

  • నెంబరు.07022 గుంటూరు - జైపూరు ప్రత్యేక రైలు ఈ నెల 22న బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి విజయవాడ, నాగ్‌పూర్‌, ఉజ్జయిని మార్గంలో ప్రయాణించి శుక్రవారం ఉదయం 6.30కి జైపూరు చేరుకుంటుంది.

Updated Date - 2023-11-20T00:31:50+05:30 IST