ముఖ హాజరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్
ABN , First Publish Date - 2023-02-07T03:40:24+05:30 IST
ఉద్యోగుల ముఖ ఆధారిత హజరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ముఖ ఆధారిత హజరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎ్‌ఫఆర్‌ఎస్ యాప్ ద్వారా 100 శాతం హాజరు నమోదు కాకపోతే సంబంధిత శాఖలు, విభాగాలపాలనా అధికారులు, నోడల్ అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి వస్తుందని సాధారణ పరిపాలనశాఖ స్పష్టం చేసింది. 100 శాతం హాజరు నమోదుకు చర్యలు చేపట్టాలని సోమవారం మెమో జారీ చేసింది.