19న ఎస్‌ఐ ప్రిలిమ్స్.. వెబ్‌సైట్లో హాల్ టికెట్లు
ABN , First Publish Date - 2023-02-07T03:54:10+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న జరగనున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షకు పోలీసు శాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది.

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న జరగనున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షకు పోలీసు శాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫిబ్రవరి 15 సాయంత్రం ఐదు గంటల వరకూ బోర్డు వెబ్ సైట్ జ్ట్టిఞ://టజూఞటఛ.్చఞ.జౌఠి.జీుఽ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. అనంతపురం, కర్నూలు, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం రేంజ్‌ల పరిధిలో 19న పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా ఊరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 411ఎస్‌ఐ ఉద్యోగాలకు అనుమతివ్వడంతో గత నవంబరు 28న రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గడువు ముగిసే సమయానికి 1.73లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకున్నారు. అనుమానాల నివృత్తి కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని లేదా 94414 50639 నంబర్‌కు ఫోను చేయవచ్చని చైర్మన్ సూచించారు.