దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా

ABN , First Publish Date - 2023-03-25T03:10:21+05:30 IST

రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను షెడ్యూల్డు కులాల జాబితాలోను, బోయ, వాల్మీకీలను గిరిజన కులాల జాబితాల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ రెండు తీర్మానాలను శాసనసభ ఆమోదించింది.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా

బోయ, వాల్మీకీలకు ఎస్టీ గుర్తింపు .. అసెంబ్లీ చివరి రోజున తీర్మానాలు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను షెడ్యూల్డు కులాల జాబితాలోను, బోయ, వాల్మీకీలను గిరిజన కులాల జాబితాల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ రెండు తీర్మానాలను శాసనసభ ఆమోదించింది. ఈ తీర్మానాలను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై సీఎం జగన్‌ మాట్లాడారు. ‘‘దళిత క్రైస్తవులను ఎస్సీలు గుర్తించాలని కోరుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దీనిపై సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో ఏపీ ప్రభుత్వం తరపున కూడా ఇంప్లీడ్‌ అయ్యి వాదనలు వినిపిస్తున్నాం. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని నిర్ణయించాం. ఈ రెండు తీర్మానాలను పార్లమెంటు ఆమోదం కోసం పంపుతున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-03-25T03:10:21+05:30 IST