సచివాలయాల పనితీరు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2023-02-02T00:59:01+05:30 IST

జిల్లాలో గ్రామ/వార్డు సచివా లయాల పనితీరు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వహించే పర్యవేక్షణాధికా రులపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి హెచ్చ రించారు.

సచివాలయాల పనితీరు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వద్దు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్న కలెక్టర్‌

గుంటూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో గ్రామ/వార్డు సచివా లయాల పనితీరు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వహించే పర్యవేక్షణాధికా రులపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి హెచ్చ రించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డివిజన్‌, మండ ల స్థాయి అధికారులతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమ లుపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయాల్లో ప్రభుత్వ సేవల దరఖాస్తులను నిర్ణీత గడువులోపు కచ్ఛితంగా పరిష్కరించాలన్నా రు. సచివాలయాల పనితీరుపై ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, నోడల్‌ అధికారు లు వారంలో మూడు రోజులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదాయ, కులధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల ని సబ్‌కలెక్టర్‌, ఆర్‌డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. జగనన్న చేదోడు రెండో విడత నిధులకు సం బంధించిన పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో మంజూరు చేసిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయా లన్నారు. పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్లలో ఉగాది నాటికి 10 వేలకు పైగా ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను లేఅవుట్‌ ల వా రీగా రూపొందించి గురువారం అందజేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురో గతిని మండల స్థాయి అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు నిరంత రం పర్యవేక్షించాలన్నారు. జేసీ రాజకుమారి మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జిల్లా అధికా రులు జారీ చేసే ఆదేశాలు, మార్గదర్శకాలను సంబంధిత ఉద్యోగు లకు వెంటనే చేరవేయాలన్నారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి, జడ్పీ సీఈవో మోహన్‌రావు, సీపీవో శేషశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:59:05+05:30 IST