జీతాల బకాయిలు విడుదల చేయండి

ABN , First Publish Date - 2023-02-21T03:26:40+05:30 IST

కొవిడ్‌ సమయంలో పెండింగ్‌లో పెట్టిన ఎనిమిది నెలల జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ మోడల్‌ స్కూల్స్‌ గర్ల్స్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ కోరింది.

జీతాల బకాయిలు విడుదల చేయండి

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయంలో పెండింగ్‌లో పెట్టిన ఎనిమిది నెలల జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ మోడల్‌ స్కూల్స్‌ గర్ల్స్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు సి.సుధారాణి, సుమలత, డి.ఉషారాణి సోమవారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో మోడల్‌ స్కూల్స్‌ కార్యదర్శి రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే తమకు మినిమం టైమ్‌ స్కేలు అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-02-21T03:26:41+05:30 IST