రేషన్‌ అందేనా?

ABN , First Publish Date - 2023-04-03T00:17:10+05:30 IST

నెలారంభంలోనే కుయ్‌కుయ్‌ అంటూ వీధుల్లోకి వచ్చే రేషన్‌ సరుకుల పంపిణీ ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూని ట్‌) వాహనం ఆచూకీలేదు. రెండు రోజు లైనా ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా వాహనాల జాడ లేదు. పలువురు బంద్‌లోకి వెళ్లగా కొందరు మాత్రమే ఎండీయూ వాహనా లతో సరుకులను పంపిణీ చేస్తున్నారు.

రేషన్‌ అందేనా?

నరసరావుపేట, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): నెలారంభంలోనే కుయ్‌కుయ్‌ అంటూ వీధుల్లోకి వచ్చే రేషన్‌ సరుకుల పంపిణీ ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూని ట్‌) వాహనం ఆచూకీలేదు. రెండు రోజు లైనా ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా వాహనాల జాడ లేదు. పలువురు బంద్‌లోకి వెళ్లగా కొందరు మాత్రమే ఎండీయూ వాహనా లతో సరుకులను పంపిణీ చేస్తున్నారు. మొత్తంమీద రేషన్‌ పంపిణీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మందకొడిగా జరుగు తో న్నది. ఈ నెలలో రెండు రోజులు గడిచిపోయినా 10 శాతం మంది కార్డుదారులకు కూడా ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) ఆప రేటర్లు సరుకులు చేరవేయలేకపోయారు. ఇందుకు కారణం ఎండీయూ వాహనాలకు బీమా చెల్లింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం మాట తప్పడమే. దీంతో ఆపరేటర్లలో కొంతమంది వాహనాలను బంద్‌ చేశా రు. కొందరు మాత్రమే సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే సరు కులు నిండుకున్న ఇళ్లల్లో పేదలు ఎప్పుడెప్పుడు ఎండీయూ వాహనం వస్తుందని ఎదురు చూస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సరుకుల పంపిణీపై స్పష్టత వస్తుందని ఆపరేటర్లు చెబుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లను ఎంపిక చేసేటప్పుడే ప్రభుత్వం వాహనానికి సంబంధించి పన్నులు తామే చెల్లిస్తామని చెప్పింది. ఇప్పుడు వారినే భరించమని చెబుతున్నది. ఆయా పన్నులు రూ.వేలల్లో ఉండటంతో తమకు వచ్చే ఆదాయంలో దాదాపుగా 30 శాతం వాటికే పోతుందని ఆపరేటర్లు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే పన్నులు చెల్లించాలని కోరుతు న్నారు. ఈ విషయంలో ఎలాంటి హామీ రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ పంపిణీని బంద్‌ చేయాలని ఎండీయూ ఆపరేటర్ల సంఘం నా యకులు నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం కొంతమంది, ఆదివారం కొందరు ఆపరేటర్లు రేషన్‌ సరుకుల పంపిణీకి వెళ్లలేదు. గుంటూరు జిల్లాలో 972 రేషన్‌ దుకాణాలున్నాయి. 5 లక్షల 90 వేల 546 రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలున్నాయి. కాగా ఈ రెండు రోజుల్లో కేవలం 33,423 మంది కుటుంబాలకు మాత్రమే ఆపరేటర్లు సరుకులు అందించారు. జిల్లాలో ఉన్న కార్డుల సంఖ్యని పరిగణనలోకి తీసుకుంటే కేవలం 5.65 శాతం మందికి మాత్రమే ఆదివారం సా యంత్రం వరకు సరుకులు పంపిణీ జరిగింది.

బాపట్ల జిల్లాలో పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 1,123దుకా ణాలుండగా 4,80,057 కార్డులు కలిగిన కుటుంబాలున్నాయి. వారిలో ఇప్ప టివరకు 53,257(11.09 శాతం) మందికి సరుకులు సరఫరా జరిగాయి.

పల్నాడు జిల్లాలో 1,290 రేషన్‌దుకాణాలుండగా ఇక్కడ 6 లక్షల 36 వేల 802 కార్డులున్నాయి. ఇప్పటివరకు 51,973(8.16 శాతం) మందికి పంపిణీ జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా కార్డుదారులకు ఎప్పటికి పం పిణీ చేస్తారో తెలియకుండా ఉన్నది. ఒకవైపు బంద్‌ గురించి స్పష్టత లేదు. మరోవైపు రంజాన్‌ పండగ కారణంగా పేద ముస్లిం కుటుంబాలు సరుకులు అయిపోయి ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ప్రత్యామ్నాయంగా కనీసం రేషన్‌ షాపుల్లోనైనా సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఏమినిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - 2023-04-03T00:17:10+05:30 IST