ఏపీ బీసీ కమిషన్‌కు విధివిధానాలు
ABN , First Publish Date - 2023-02-01T03:35:35+05:30 IST
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ బీసీ కమిషన్‌ను పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్‌గా నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ బీసీ కమిషన్‌ను పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్‌గా నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు విధివిధానాలు రూపొందిస్తూ ఆదేశాలిచ్చింది. తాజా ఆదేశాలతో ఆయా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 50శాతం రిజర్వేషన్లు దాటకుం డా చర్యలు తీసుకున్నారో, లేదో పరిశీలించే అధికారం కమిషన్‌కు ఉంటుంది.