ఏపీఐఐసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2023-04-11T01:36:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఏపీఐఐసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంఽధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పరిశ్రమలశాఖ కమిషనర్‌గా (పూర్తి అదనపు బాధ్యతలు), ఏపీ మ్యారీటైం బోర్డు సీఈవోగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - 2023-04-11T01:36:21+05:30 IST