దళితుని భూమి.. సోము కబ్జా!

ABN , First Publish Date - 2023-02-21T02:51:54+05:30 IST

బెదిరించి, భయపెట్టి ఖరీదైన తన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురిపై ఓ దళిత బాధితుడు

దళితుని భూమి.. సోము కబ్జా!

బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సహా పలువురిపై ఆరోపణలు

ఎదిరిస్తే ఎన్‌కౌంటర్‌ చేయిస్తానంటున్నారు

గుంటూరు ఎస్పీ ఆఫీ్‌సలో బాధితుడి ఫిర్యాదు

మంగళగిరి హైవే వద్ద రూ.15 కోట్ల భూమి

రూ.5 కోట్లు ఇస్తాం.. వదులుకోమంటున్నారు

చర్చలకని పిలిచి తుపాకీతో భయపెట్టారు

కేసులు.. ఈడీతో దాడులంటూ హెచ్చరించారు

2 సార్లు ప్రహరీ కూలగొట్టి, రాళ్లు పీకేశారు

పోలీసులూ పట్టించుకోవడం లేదు

గుంటూరు, ఫిబ్రవరి 20 : బెదిరించి, భయపెట్టి ఖరీదైన తన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురిపై ఓ దళిత బాధితుడు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. దారికి రాకపోతే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తామని బెదరగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోము వీర్రాజు పార్టీకే చెందిన మరో నేత తనకు తుపాకీని చూపించి... ఎన్‌కౌంటరు చేయిస్తానని హెచ్చరించాడని తెలిపారు. గుంటూరు పరిధిలో జాతీయరహదారిపై ఎన్నారై కళాశాల సమీపంలో రూ.కోట్ల ఖరీదు చేేస తన స్థలాన్ని కబ్జా చేేసందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ తన ఫిర్యాదులో ఆయన వేడుకొన్నారు. దళిత బాధితుడి కథనం ప్రకారం, విజయవాడ గుణదలకు చెందిన గొల్ల వరప్రసాద్‌ ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌. ఆయన ఎన్నారై కళాశాల సమీపంలో 3.20 ఎకరాలమేర కొనుగోలు చేశారు. ఇందులో 2014 మే 19న 2202 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసి మంగళగిరి సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలో తన పేరుతో రిజిరేస్టషన్‌ చేయించుకున్నారు. అదే సర్వే నంబర్‌లోని మరో 2202 చదరపు గజాల స్థలాన్ని అదే ఏడాది జూన్‌ 11న కొనుగోలు చేసి భార్య పేరుతో రిజిరేస్టషన్‌ చేయించారు. దానికి పక్కనే ఉన్న మరో రెండు ఎకరాల 30 సెంట్ల స్థలాన్ని గతంలోనే కొనుగోలు చేసి తన పేరుతో అగ్రిమెంట్‌ కూడా రాయించుకున్నారు. ఈ భూముల మొత్తం విలువ రూ. 15కోట్లపైనే. గత ఏడాది అక్టోబరు 22న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి భూ కబ్జాకు ప్రయత్నించారు. ఆ విషయం తెలిసి స్థలం వద్దకు గొల్ల వరప్రసాద్‌ వెళ్లారు. అప్పటికే అక్కడ కొంతమంది దౌర్జన్యంగా ప్రహరీ గోడ కూల్చి రాళ్లు పీకేస్తుండడం ఆయన కంటపడింది. వారిని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వరప్రసాద్‌ను కులం పేరిట దూషిస్తూ, దాడి చేశారు. ఈ దాడి వల్లభనేని సుధాకర్‌ చౌదరి, రావెళ్ల మోహన్‌ కుమారి ప్రోద్బలంతో వల్లభనేని శ్రీనివాసరావు, చాగర్లమూడి రామారావు, మరో పది మంది చేశారంటూ ఆయనను పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి రూరల్‌ పోలీస్‌ ేస్టషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది.

దళితుడికి ఖరీదైన స్థలం అవసరమా?

గత ఏడాది నవంబరు 13న బద్రిరెడ్డి వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి... వరప్రసాద్‌కు ఫోన్‌ చేసి సెటిల్‌ చేసుకుందాం రమ్మని పిలిపించాడు. వెంకట్‌రెడ్డి విజయవాడ రూరల్‌ నున్నలో ఉన్న మామిడి తోటకు వెళ్లగా, అప్పటికే సోము వీర్రాజు, బీజేపీ నేత లక్ష్మీపతిరాజా, మరికొందరు చేరుకున్నారు. ‘‘నీ స్థలాన్ని మేం తీసుకుంటున్నాం. ఐదు కోట్లు ఇస్తాం. మర్యాదగా తప్పుకో’’మంటూ వరప్రసాద్‌ను ఆ ఇద్దరు బెదిరించారు. తనకు ఇష్టం లేదని చెప్పగా వారిద్దరూ మరింత స్వరం పెంచారు. ‘‘నువ్వు దళితుడవు. మేం కేంద్రంలో అధికారంలో ఉన్నాం. కేసుల్లో ఇరికించి, ఎన్‌కౌంటర్‌ చేయిస్తాం. మర్యాదగా ఇచ్చిన చెక్కు తీసుకొని కాగితాలపై సంతకం పెట్టి వెళ్లు’ అని బెదిరించారు. వల్లభనేని శ్రీనివాసరావు ఆయన మెడపై కొట్టాడు. లక్ష్మీపతిరాజా తుపాకి తీసి... కాల్చేస్తానంటూ బెదిరించాడు. దళితుడికి ఇంత ఖరీదైన స్థలం అవసరమా.. అని దూషించాడు.. భయపడిపోయిన వరప్రసాద్‌.. ఇంట్లో వారిని కనుక్కొని చెబుతానన్నాడు. వారం రోజులు సమయం ఇస్తున్నామని బెదిరించారు. ఈ క్రమంలో ఈ నెల 11న మరోసారి వరప్రసాద్‌ స్థలంలోకి 20మంది ప్రవేశించి ప్రహరీ గోడను కూల్చి అందులోని హద్దురాళ్లను పీకేశారు. దీనిపై ఆయన మంగళగిరి రూరల్‌ పోలీస్‌ ేస్టషన్లో ఫిర్యాదుచేశారు. ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుంటూరు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో గొల్ల వరప్రసాద్‌ తెలిపారు. సోము వీర్రాజు, లక్ష్మీపతిరాజాతోపాటు బద్రిరెడ్డి వెంకట్‌రెడ్డి, వల్లభనేని సుధాకర్‌చౌదరి, వల్లభనేని శ్రీనివాసరావులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, తన ఆస్తికి తగిన రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

Updated Date - 2023-02-21T02:52:02+05:30 IST