త్వరలో పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ డ్రైవ్
ABN , First Publish Date - 2023-02-07T03:26:10+05:30 IST
: పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెలలో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి తెలిపారు.

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెలలో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి తెలిపారు. సోమవారం మంగళగిరిలోని కార్యాలయం నుంచి అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకులు, విద్యార్థులతో వీడియో కానర్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో స్థాపించబోయే స్మార్ట్ డీవీ టెక్నాలజీస్ ద్వారా ఈ ఏడాది 600 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే సెమికాన్ రంగంలో తక్షణ ఉపాధి లభిస్తోందన్నారు. డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 25న విద్యార్థులకు రాత పరీక్ష ఉంటుందని, విద్యార్థులను సన్నద్ధం చేయాలని అధ్యాపకులకు సూచించారు. సమావేశంలో స్మార్ట్ డీవీ టెక్నాలజీస్ ఎండీ దీపక్ కుమార్ మాట్లాడారు.