ప్రవేశ పరీక్షతోనే నర్సింగ్ సీట్లు
ABN , First Publish Date - 2023-03-19T02:45:31+05:30 IST
నర్సింగ్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష తప్పనిసరి అని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల మేరకు 2023- 24 విద్యా సంవత్సరం నుంచి కౌన్సెలింగ్ ద్వారానే ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే నర్సింగ్ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు.

వారూ ఇకపై ఈఏపీసెట్ రాయాల్సిందే
స్పష్టం చేసిన ఉన్నత విద్యామండలి
అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష తప్పనిసరి అని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల మేరకు 2023- 24 విద్యా సంవత్సరం నుంచి కౌన్సెలింగ్ ద్వారానే ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే నర్సింగ్ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు. వైఎ్‌సఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ప్రక్రియ చేపడుతోంది. నర్సింగ్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలతో ఇకనుంచి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా సీట్లకు ఏటా నిర్వహిస్తోన్న ఈఏపీసెట్‌లో నర్సింగ్‌ను కూడా చేర్చబోతున్నారు. బీఎస్సీ(నర్సింగ్)లో అడ్మిషన్లు కావాలనుకునే విద్యార్థులంతా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది.