పరిశ్రమలపై ఇంధన చార్జీల బాదుడు వద్దు

ABN , First Publish Date - 2023-09-22T03:49:28+05:30 IST

ఇప్పటికే కష్టాల్లో ఉన్న పరిశ్రమలపై మళ్లీ ఇంధన చార్జీల భారాన్ని మోపి మరిన్ని కష్టాల్లోకి నెట్టవద్దని ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ చాంబర్స్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

పరిశ్రమలపై ఇంధన చార్జీల బాదుడు వద్దు

ప్రభుత్వానికి ఏపీ చాంబర్స్‌ ప్రతినిఽధి బృందం వినతి

అమరావతి, విజయవాడ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే కష్టాల్లో ఉన్న పరిశ్రమలపై మళ్లీ ఇంధన చార్జీల భారాన్ని మోపి మరిన్ని కష్టాల్లోకి నెట్టవద్దని ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ఏపీ చాంబర్స్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గత కొన్నేళ్లుగా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ) చార్జీల పెంపుదలను కనీసం ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏపీ చాంబర్స్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొట్లూరి భాస్కరరావు, బి రాజశేఖర్‌ నేతృత్వంలో పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర విద్యుత్‌శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె విజయానంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-09-22T03:49:28+05:30 IST