నేడూ రేషన్‌ సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2023-04-18T02:41:41+05:30 IST

రాష్ట్రంలో రేషన్‌ సరుకులను మంగళవారం కూడా పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా 15వ తేదీలోపే కార్డుదారులందరికీ నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తిచేయాల్సి ఉంది.

నేడూ రేషన్‌ సరుకుల పంపిణీ

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్‌ సరుకులను మంగళవారం కూడా పంపిణీ చేయనున్నారు. ప్రతినెలా 15వ తేదీలోపే కార్డుదారులందరికీ నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ఈ నెలలో ఎక్కువ మందికి సరుకులు పంపిణీ కాలేదు. దీంతో ఈ నెల 18 వరకు పంపిణీని పొడిగిస్తూ పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ సరుకుల పంపిణీ కొనసాగనుంది.

Updated Date - 2023-04-18T02:41:41+05:30 IST