7న తిరుపతిలో జాతీయ ఓబీసీ మహాసభ: కేసన
ABN , First Publish Date - 2023-07-19T03:35:32+05:30 IST
ఓబీసీల జనగణన, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు తదితర ఓబీసీ సమస్యలపై ఆగస్టు 7న తిరుపతి వేదికగా జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.
గుంటూరు, జూలై 18: ఓబీసీల జనగణన, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు తదితర ఓబీసీ సమస్యలపై ఆగస్టు 7న తిరుపతి వేదికగా జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియా మాట్లాడారు. ఓబీసీల అభివృద్ధి కోసం మండల్ కమిషన్ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ అని చెప్పుకొనే మోదీ ప్రధానిగా ఉండి బీసీలకు ఏం ఒరగబెట్టారని ధ్వజమెత్తారు. 2021 జనాభా లెక్కల సేకరణలో బీసీ కుల జనగణన కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 7న తిరుపతిలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ఏపీ సీఎం జగన్‌తో పాటు పలు రాజకీయపార్టీల నేతలు, ఓబీసీ జాతీయ నేతలు హాజరవుతున్నట్టు తెలిపారు.