శారీరక శ్రమ ప్రోత్సాహానికి చర్యలు: ఎంటీ కృష్ణబాబు
ABN , First Publish Date - 2023-02-21T03:35:14+05:30 IST
బీపీ, షుగర్ వంటి వ్యాధుల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించేందుకు నడక, వ్యాయామం జీవన శైలిలో తప్పనిసరి చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు సృష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ప్రైవేటు, ఎయిడెడ్.
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : బీపీ, షుగర్ వంటి వ్యాధుల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించేందుకు నడక, వ్యాయామం జీవన శైలిలో తప్పనిసరి చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు సృష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ప్రైవేటు, ఎయిడెడ్, సాంకేతిక విద్యా సంస్థల అసోసియేషన్లు, యాజమాన్యాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో శారీరక శ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకూ నడక కోసం స్థలాలు, క్రీడామైదానాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అసోసియేషన్లు తమ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా అందజేయాలని కోరారు.