ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టడం హత్యానేరమా?

ABN , First Publish Date - 2023-03-19T02:46:10+05:30 IST

జంగారెడ్డిగూడెంలో విద్యార్థులను పోలీస్‌ లాక్‌పలో పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు.

ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టడం హత్యానేరమా?

విద్యార్థులను లాక్‌పలో పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి, మార్చి18 (ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెంలో విద్యార్థులను పోలీస్‌ లాక్‌పలో పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టారని జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులను లాక్‌పలో పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఫ్యాన్‌ రెక్కలు పాడు చేయడం ఏమన్నా హత్యా నేరమా? అని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. చిన్న తప్పునకు విద్యార్థులను పోలీసులు కొట్టడమే కాకుండా ఏకంగా లాక్‌పలో పెట్టడం నివ్వెరపర్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. పైగా పాఠశాల విద్యార్థులను పోలీ్‌సస్టేషన్‌లో మరుగుదొడ్లు కడగాలని చెప్పడం, సంతకాలు పెట్టించుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులందరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-19T02:46:10+05:30 IST