‘తెలుగు భాష-సంస్కృతి’పై అంతర్జాతీయస్థాయి కార్టూన్ల పోటీ

ABN , First Publish Date - 2023-01-17T03:15:28+05:30 IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ‘తెలుగు భాష - సంస్కృతి’పై అంతర్జాతీయ స్థాయిలో వ్యంగ్య చిత్ర (కార్టూన్లు) పోటీలు నిర్వహించింది.

‘తెలుగు భాష-సంస్కృతి’పై అంతర్జాతీయస్థాయి కార్టూన్ల పోటీ

22న బెజవాడలో విజేతలకు బహుమతులు: తానా

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ‘తెలుగు భాష - సంస్కృతి’పై అంతర్జాతీయ స్థాయిలో వ్యంగ్య చిత్ర (కార్టూన్లు) పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో 12 మంది, ఉత్తమ కార్టూన్ల విభాగంలో 13 మంది విజేతలుగా నిలిచినట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినిధి డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర సోమవారం వెల్లడించారు. అమెరికాకు చెందిన కిరణ్‌ ప్రభ, దుబాయ్‌కి చెందిన శ్రీమతి ప్రశాంతి చోప్రా, లండన్‌కు చెందిన అరవిందారావులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. ఈనెల 22న విజయవాడలో నిర్వహించనున్న సభలో విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. బహుమతులకు ఎంపికైన కార్టూన్లను త్వరలో ‘ఈ-పుస్తకం’ రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

Updated Date - 2023-01-17T03:15:29+05:30 IST