ఆదర్శవంతుల బాటలో నడుచుకోవాలి
ABN , First Publish Date - 2023-02-21T01:18:51+05:30 IST
అమ్మా చందమామను చూపించి అన్నం తినిపిస్తుంది, అలాగే ఆదర్శ వంతులు మార్గాన్ని చూపుతారు, వారి ప్రేరణ, స్పూర్తితో విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు దిద్దుకోవాలని 1వ అదనపు జ్యూడిషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ర్టేట్ మహ్మద్ రహంతుల్లా తెలిపారు.
న్యాయమూర్తి మహ్మద్ రహంతుల్లా
సాంఘిఖ సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ
న్యాయవిజ్ఞాన సదస్సులో విద్యార్థులకు సూచనలు
తెనాలి క్రైం, ఫిబ్రవరి 20 : అమ్మా చందమామను చూపించి అన్నం తినిపిస్తుంది, అలాగే ఆదర్శ వంతులు మార్గాన్ని చూపుతారు, వారి ప్రేరణ, స్పూర్తితో విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు దిద్దుకోవాలని 1వ అదనపు జ్యూడిషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ర్టేట్ మహ్మద్ రహంతుల్లా తెలిపారు. సోమవారం స్ధానిక కొత్తపేటలోని సాంఘీక, సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను, గదులు, భోజనశాల, వాషింగ్ ఏరియాను ఆయన స్వయంగా పరిశీలించారు. బాత్‌రూమ్, మరుగుదొడ్ల గదులకు సరిగా తలుపులు లేకపోవడం గుర్తించి వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని హాస్టల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని స్వయంగా తిని పలు సూచనలు చేశారు. అనంతరం మండల న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశలో తప్పటడుగులు పడితే భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, ఆ ఆశలు నెరవేర్చడానికి, మీ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి ధృఢ సంకల్పంతో లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని తెలిపారు. కార్య క్రమంలో ఏఎస్‌డబ్ల్యూవో జి.శైలజ, హెచ్‌డబ్ల్యూజడ జయప్రద, ప్రిన్సిపాల్ నిరీక్షణరావు, ఆనంద్, జన్‌టౌన్ సీఐ కె.చంద్రశేఖరరావు, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, యర్రంశెట్టి అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.