కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో రూ.50కోట్లతో హాస్టల్‌

ABN , First Publish Date - 2023-02-28T03:42:08+05:30 IST

కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో అత్యాధునిక ప్రమాణాలతో గుంటూరులోని జేకేసీ కళాశాల రోడ్డులో నిర్మించనున్న నూతన హాస్టల్‌ భవనసముదాయానికి ప్రవాసభారతీయులు డాక్టర్‌ నూతక్కి రామకృష్ణప్రసాద్‌ సోమవారం శంకుస్థాపన చేశారు.

కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో రూ.50కోట్లతో హాస్టల్‌

శంకుస్థాపన చేసిన ఎన్‌ఆర్‌ఐ నూతక్కి రామకృష్ణప్రసాద్‌

గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి 27: కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో అత్యాధునిక ప్రమాణాలతో గుంటూరులోని జేకేసీ కళాశాల రోడ్డులో నిర్మించనున్న నూతన హాస్టల్‌ భవనసముదాయానికి ప్రవాసభారతీయులు డాక్టర్‌ నూతక్కి రామకృష్ణప్రసాద్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ భవననిర్మాణానికి నూతక్కి రామకృష్ణప్రసాద్‌ రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. దాదాపు రూ. 50 కోట్లతో నిర్మించనున్న 8 అంతస్థుల భవనసముదాయం ద్వారా రెండువేల మంది కమ్మ సామాజిక వర్గ విద్యార్ధినులకు వసతిని సమకూర్చనున్నారు. రెండు సంవత్సరాల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోస్తామని కమ్మజన సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు సామినేని కోటేశ్వరరావు, చుక్కపల్లి రమేష్‌ తెలిపారు. పూర్తిగా దాతల సహకారంతో భవననిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటివరకు విరాళాలు ప్రకటించిన దాతలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సృజనాచౌదరి, మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, వైసీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్‌, నంబూరు శంకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-28T03:42:08+05:30 IST