హైకోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-02-24T02:44:32+05:30 IST

హైకోర్టులోని పలు విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను హైకోర్టు రిజిస్ట్రార్‌(అడ్మిన్‌) ఎ.గిరిధర్‌ విడుదల చేశారు.

హైకోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): హైకోర్టులోని పలు విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను హైకోర్టు రిజిస్ట్రార్‌(అడ్మిన్‌) ఎ.గిరిధర్‌ విడుదల చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను గురువారం హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. హైకోర్టులో సెక్షన్‌ ఆఫీసర్‌(9), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(13), కంప్యూటర్‌ ఆపరేటర్‌(11), ఓవర్సీర్‌(1), అసిస్టెంట్‌ ఓవర్సీర్‌(1), అసిస్టెంట్‌(14), ఎగ్జామినర్‌(13), టైపిస్టు(16), కాపీయిస్టు(20), డ్రైవర్‌(8), ఆఫీస్‌ సబార్డినేట్‌(135) మొత్తం 241 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21న నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Updated Date - 2023-02-24T02:44:33+05:30 IST