ఏపీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్: కేంద్రం
ABN , First Publish Date - 2023-10-01T03:42:17+05:30 IST
రాష్ట్రంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ జారీచేసింది.
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ జారీచేసింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ చెల్లింపుదారుల వివాదాలు పరిష్కరించడం కోసం దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్‌లు జనవరిలోగా ఏర్పాటవుతాయని కేంద్రం వెల్లడించింది.