గ్రావెల్ మాఫియా దోపిడీ రూ. 500 కోట్లు
ABN , First Publish Date - 2023-04-29T00:32:47+05:30 IST
పొన్నూరు నియోజకవర్గంలో శేకూరు వీన నాయకునిపాలెంలో పలు గ్రామాల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోం దని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు.
గుంటూరు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పొన్నూరు నియోజకవర్గంలో శేకూరు వీన నాయకునిపాలెంలో పలు గ్రామాల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోం దని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహిం చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 500 ఎకరాల్లో గ్రావెల్ తవ్వేశారని, 150 కోట్ల రూపా యల గ్రావెల్ మాఫియా దోపిడీకి గురయిం దని ఆ యన ఆరోపించారు. ముఖ్యమంత్రి స్పందన కార్యక్ర మం అంటూ ప్రగల్బాలు పలకడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది అని చెప్పి అడిగినవారిపై జులుం చేయడం దుర్మార్గమ న్నారు. ఐడీకార్డులు చూపించి ప్రజలను, అధికారుల ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నా రు. స్థానిక ఎమ్మెల్యే లారీలకు మాత్రమే గ్రావెల్ తరలించే హ క్కు ఉన్నట్లుగా కనపి స్తోందని ఆయన విమ ర్శించారు. బయటివారు ఎవరైనా వెళితే మాత్రం పోలీసు లు తుపాకులు ఎక్కు పెడుతున్నార న్నారు. వందల కోట్ల నుంచి వేలకోట్ల రూపా యలు దోచుకుంటున్నా ఒక్కరు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కలెక్టర్ సహా అధికారులు ఒక్కరు కూడా పట్టించుకోవట్లే దన్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతరు చేసి మాఫియా చెలరే గిపోతోందన్నారు. కార్యక్రమంలో రాజామాస్టారు, సుఖవాసి శ్రీనివాస రావు, కంచర్ల శివరామయ్య, నారా జోషి, పాశం నవీన్, ఓంకార్, బొబ్బిలి రామారావు, డీఎస్‌ఆర్, సాయికృష్ణ, దయారత్నం, హుస్సేన్ పాల్గొన్నారు.