అదనపు టోల్‌ చార్జీని ప్రభుత్వమే భరించాలి: డోలా

ABN , First Publish Date - 2023-04-03T02:09:00+05:30 IST

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పెంచుతున్న 5ు టోల్‌ చార్జీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు.

అదనపు టోల్‌ చార్జీని ప్రభుత్వమే భరించాలి: డోలా

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పెంచుతున్న 5ు టోల్‌ చార్జీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువులు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, కరెంట్‌ చార్జీలు భారీగా పెరిగిపోయి, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకుందని, ఇప్పుడు టోల్‌ చార్జీల పెంపుతో మళ్లీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-03T02:09:00+05:30 IST