లోకేశ్‌ ఆరోపణలపై సీఐడీ విచారణ చేయించండి

ABN , First Publish Date - 2023-03-25T03:14:19+05:30 IST

‘లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరు వచ్చి తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలిసి రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఆక్రమణలకు పాల్పడ్డామని ఆరోపించారు.

లోకేశ్‌ ఆరోపణలపై సీఐడీ విచారణ చేయించండి

రామచంద్రారెడ్డి డిమాండ్‌

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరు వచ్చి తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలిసి రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఆక్రమణలకు పాల్పడ్డామని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సీఐడీతో సమగ్ర విచారణ చేయించాలి. విచారణ చేయించకుంటే మేం తప్పు చేసిన వాళ్లమవుతాం. విచారణ జరిపి ఆరోపణలపై నిగ్గు తేల్చండి’ అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ‘కిరణ్‌కుమార్‌ మూడున్నరేళ్లు సీఎంగా ఉన్నారు. టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉంది. వారెన్ని ఎకరాల భూమిని కబ్జా చేశారో చెప్పాలి’ అని కోరారు. కాగా, రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సభ దృష్టికి తీసుకువచ్చారు. పశుసంవర్థకశాఖ అధికారులు కుక్కల్ని పట్టుకుని ఆపరేషన్లు చేస్తుంటే, వాటిని కూడా ఫొటో తీసి కేసులు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. జంతు సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-25T03:14:19+05:30 IST