విదేశీ విద్యా దీవెన రూ.2.25 కోట్లే

ABN , First Publish Date - 2023-09-22T03:41:41+05:30 IST

విదేశీ విద్యా దీవెన పథకం కింద నాలుగున్నరేళ్లలో 263 మంది వెనుక బడిన తరగతుల విద్యార్థులతో పాటు మొత్తం 1,830 మందికి రూ.2.25కోట్లు సహాయం అదించినట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది.

విదేశీ విద్యా దీవెన రూ.2.25 కోట్లే

అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): విదేశీ విద్యా దీవెన పథకం కింద నాలుగున్నరేళ్లలో 263 మంది వెనుక బడిన తరగతుల విద్యార్థులతో పాటు మొత్తం 1,830 మందికి రూ.2.25కోట్లు సహాయం అదించినట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానమిచ్చింది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 35,551 మందికి రూ.267 కోట్లు అందజేసినట్లు వివరించింది. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి మేరుగ నాగార్జున సమాధానమిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కులాంతర, విభిన్న ప్రతిభావంతులకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించిన లబ్ధి వివరాలను సభకు తెలిపారు. ఆలయ కమిటీలు, సలహాదారు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను రాతపూర్వకంగా సభకు సమర్పించింది.

Updated Date - 2023-09-22T03:41:41+05:30 IST