పోలీసు అభ్యర్థులకు 13 నుంచి ఫిట్‌నెస్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2023-02-21T03:20:23+05:30 IST

పోలీసు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 13 నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు (పీఆర్‌బీ) చైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. గత నవంబరు 28న పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించామని గుర్తు చేశారు.

పోలీసు అభ్యర్థులకు 13 నుంచి ఫిట్‌నెస్‌ పరీక్షలు

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పోలీసు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 13 నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు (పీఆర్‌బీ) చైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. గత నవంబరు 28న పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించామని గుర్తు చేశారు. అర్హత మార్కులు సాధించిన వారిని పీఎంటీ, పీఈటీ కోసం రెండో దశలో ఆల్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13 నుంచి 20వరకూ సమయం ఇచ్చినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా స్పందించిన అభ్యర్థులు మార్చి 1 నుంచి 10 వరకూ పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ద్వారా కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సిన్హా సూచించారు. పీఎంటీ, పీఈటీల్లో అర్హత సాధించిన వారికి ఏప్రిల్‌ చివరి వారంలో తుది రాత పరీక్ష ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-02-21T03:20:24+05:30 IST