దోపిడీ చేసి జైలుకెళ్లి దీక్షలా..?
ABN , First Publish Date - 2023-10-03T03:18:25+05:30 IST
దోపిడీ చేసి జైలుకెళ్లి దీక్షలు చేయడం ఏమిటో ప్రజలు ఆలోచించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
పవన్ వారాహి యాత్ర ఫ్లాప్: సజ్జల
అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): దోపిడీ చేసి జైలుకెళ్లి దీక్షలు చేయడం ఏమిటో ప్రజలు ఆలోచించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలున్నందునే చంద్రబాబును రిమాండ్‌కు పంపుతున్నట్టు ఏపీసీ కోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం చేపట్టిన వారాహి యాత్ర ప్లాప్ అయ్యిందన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చాక పవన్‌ను జనం నమ్మడం లేదన్నారు.