పవన్ గురించి నన్నడగొద్దు: మంత్రి కాకాణి
ABN , First Publish Date - 2023-03-02T03:20:03+05:30 IST
రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ గురించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అడిగి అవమానించొద్దని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరు.
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ గురించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అడిగి అవమానించొద్దని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసలు పవన్ కల్యాణ్‌ను, ఆయన పార్టీని మేం గుర్తించడం లేదన్నారు. పవన్ స్థాయి తోలుబొమ్మలాటలో కేతిగాడులాంటి జోకర్ అని వ్యాఖ్యానించారు. బాబుకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా? అని సీఎం జగన్ సవాల్ చేస్తే.. సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు ఏవేవో చెబుతున్నారని మంత్రి అన్నారు.