పరిశ్రమల ప్రోత్సాహకాలపై చర్చ

ABN , First Publish Date - 2023-02-07T03:41:06+05:30 IST

స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాల్సిన భూములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహాకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

పరిశ్రమల ప్రోత్సాహకాలపై చర్చ

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాల్సిన భూములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహాకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమలకు, కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాహకాలు తదితర అంశాలపై చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వలవన్‌, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T03:41:06+05:30 IST