వైసీపీకి కష్టకాలం
ABN , First Publish Date - 2023-03-19T03:05:59+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చేదుగా ఉంటాయని అధికార పక్షానికి ముందే తెలుసా? అయినా దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోయిందా? ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా పనిచేస్తున్న ఓ కీలక వ్యవస్థ ముందే హెచ్చరించిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ నివేది కలోని అంశాలే తాజాగా ఫలితాల రూపంలో బయటపడ్డాయి.

‘పట్టభద్ర’ ఫలితాలపై ముందే హెచ్చరిక
జనవరిలో సర్కారుకు కీలక వ్యవస్థ నివేదిక
ప్రభుత్వానికి షాక్ కొట్టేలా తాజా ఫలితాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చేదుగా ఉంటాయని అధికార పక్షానికి ముందే తెలుసా? అయినా దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోయిందా? ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా పనిచేస్తున్న ఓ కీలక వ్యవస్థ ముందే హెచ్చరించిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ నివేది కలోని అంశాలే తాజాగా ఫలితాల రూపంలో బయటపడ్డాయి. ప్రజావ్యతిరేకతంతా ‘బటన్’ నొక్కుడు కింద కొట్టుకుపోతుందని సర్కారు అంచనా వేసినా.. ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఇదే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ఫిబ్రవరి 1, 2 తేదీల్లో డెంజర్‌బెల్స్, వైసీపీకి కష్టకాలం శీర్షికన వరుస కథనాలు ప్రచురించింది. ఇదంతా అబద్ధమంటూ అధికార పార్టీ తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంది. కానీ నిజం ఏమిటో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై కీలక వ్యవస్థ జనవరిలోనే సర్కా రుకు నివేదిక ఇచ్చింది. అది సీఎం జగన్ చేతికి చేరింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థి తి ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది? వంటి అంశాలపై నివేదిక ఇచ్చింది. 135 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. 52 మంది ప్రజా ప్రతినిధులపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, 35 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు వద్దని ప్రజలు కోరుకుంటున్నారని, నివేదికలో పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి పట్టు పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ఉన్న బలం త గ్గిపోతోందని నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సర్పంచ్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా వేతనాలు, నిధుల విషయంలో గుర్రుగా ఉన్నారని, ఇదంతా అధికార పార్టీ వ్యతిరేక శక్తులకు కలిసొచ్చే అంశమని విశ్లేషించారు.