ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడి ఇంట్లో కొనసాగిన ఐటీ దాడులు

ABN , First Publish Date - 2023-03-02T03:11:21+05:30 IST

గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా కుటుంబీకుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల దాడులు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి.

ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడి ఇంట్లో కొనసాగిన ఐటీ దాడులు

గుంటూరు, మార్చి 1: గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా కుటుంబీకుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల దాడులు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. గుంటూరు మంగళదా్‌సనగర్‌లోని ఎమ్మెల్యే సోదరుడు కర్నుమా ఇంట్లో ఆ శాఖ అధికారులు బుధవారం కూడా సోదాలు జరిపారు. పొగాకు కంపెనీ లావాదేవీలతోపాటు ఇతరాత్ర ఆదాయ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలు, ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన పొగాకు కంపెనీ వ్యవహారాలను కర్నుమా కూడా చూస్తుంటారని తెలిసింది.

Updated Date - 2023-03-02T03:11:21+05:30 IST