Jagan: నెక్ట్స్ అరెస్ట్ కాబోయేది వీరే! అధికారులకు జగన్ ఆదేశాలు!
ABN , First Publish Date - 2023-09-20T02:29:34+05:30 IST
‘మీకేం భయంలేదు. నేను చెప్పినట్లు చేయండి! కాసిన్ని సీట్లు తగ్గినా, ఎలాగైనా మళ్లీ నేనే అధికారంలోకి వస్తా.

లోకేశ్, రామోజీనీ లోపలేయండి!
మీకేం కాదబ్బా.. నేను చూసుకుంటా
సీట్లు తగ్గినా ఎలాగైనా నేనే మళ్లీ సీఎం
దేవినేని ఉమా, కొలికపూడి అరెస్ట్ కావాల్సిందే
‘మార్గదర్శి’ శైలజ అమెరికాకు వెళ్లిపోయారు
ఉపేక్షిస్తే లాభం లేదు.. అధికారులకు జగన్ హుకుం
మాకింకా చాలా సర్వీసు ఉందన్న కొందరు అధికారులు
వచ్చే ఏడాది మా జాతకమేంటో?
మఠాల చుట్టూ తిరుగుతున్న బ్యూరోక్రాట్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘‘మీకేం భయంలేదు. నేను చెప్పినట్లు చేయండి! కాసిన్ని సీట్లు తగ్గినా, ఎలాగైనా మళ్లీ నేనే అధికారంలోకి వస్తా. మిమ్మల్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటా. చెప్పిన పని చేసుకురండి.’’... ఇదీ అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Cm jagan) ఆదేశం. జగన్ ఇటీవల లండన్ వెళ్లడం, తిరిగి వచ్చేలోపు ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu) అయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం పక్కా స్కెచ్ ప్రకారమే జరిగాయి. ఈనెల 12వ తేదీన తాడేపల్లికి తిరిగి వచ్చిన జగన్....కొందరు అధికారులతో భేటీ అయ్యారు. వారిని అభినందనలతో ముంచెత్తుతూ ఇదే పరంపర కొనసాగించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు జగన్‌తో భేటీఅయిన వారిలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మరికొద్దిమంది అధికారులు ఉన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు, చంద్రబాబు అరెస్ట్ పట్ల ఈ సమావేశంలో హర్షం వ్యక్తం చేసిన జగన్....లోకేశ్‌ను అరెస్ట్ చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ‘‘నేను చెప్పినాను కదా! ఎందుకు అరెస్ట్ చేయలేదు. మీరేమి చేస్తారో నాకు తెలియదు. తొందరలోనే లోకేశ్‌ను (Nara lokesh), రామోజీరావును (Ramojini) అరెస్ట్ చేయండి. నేను ఎంతో క్లియర్‌గా చెప్పినా కూడా ఎందుకని వదిలేశారు? మీ నిర్లక్ష్యం వల్లనే మార్గదర్శి ఎండీ శైలజ అమెరికా వెళ్లిపోయారు. మీకా విషయం కూడా తెలియదు. ఇట్టా అయితే ఎట్టా? కానియ్యండి. త్వరగా మిగిలిన వారిని అరెస్ట్ చేయండి. వారితోపాటు మైకుల ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న దేవినేని ఉమా, కొలికపూడి శ్రీనివా్‌సను కూడా లోపల వేసేయండి. మీకేం భయంలేదబ్బా. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమస్యేలేదు. మళ్లీ నేనే సీఎం. మీ అందరికి ఏం కావాలో నేను చేసిపెడతా. ఏదైనా, ఏమైనా నేను చేసి పెడతా. ముందుకెళ్లండి’’ అని భరోసా ఇచ్చారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న సిట్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి తనకు ఇంకా చాలా ఏళ్ల సర్వీసు ఉందని ప్రస్తావించారు. ’’ఏం ఫర్వాలేదు. అవన్నీ నేను చూసుకుంటా. అనుకున్న ప్రకారం అన్నీ చేయండి’’ అని జగన్ హుకుం జారీ చేశారు.
మా జాతకం ఎలా ఉంది?.. పీఠాధిపతుల వద్దకు సీనియర్ బ్యూరోక్రాట్లు
జగన్ సర్కారులో కీలక పదవుల్లో ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్లు కొందరికి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటంటూ ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో తెలుసుకునేందుకు పీఠాధిపతులను ఆశ్రయిస్తున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం....ప్రభుత్వంలో అతి కీలకమైన రెండు పదవుల్లో ఉన్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ ఇటీవల హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఉన్న పుష్పగిరి పీఠాధిపతిని కలిశారు. అక్కడి పీఠాధిపతి విద్యాశంకర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రానున్న రోజుల్లో తన భవిష్యత్తు ఎలా ఉండనుందో దివ్యదృష్టితో చూసి చెప్పాలని కోరినట్లు తెలిసింది. ఆ స్వామి ఏంచెప్పారో ఏమోకానీ, ఆ బ్యూరోక్రాట్ చాలా ఆత్రుత, ఆందోళన పడుతూ బయటకు వచ్చారు. అనంతరం తిరుమల, కాణిపాకం వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ అధికారి గత ప్రభుత్వంలో అత్యంత కీలకహోదాలో పనిచేశారు. ఆ అధికారి పూజల విషయం తెలుసుకున్న మరో ఇద్దరుఅధికారులు కూడా పుష్పగిరి వెళ్లినట్లు తెలిసింది.