డీఎంఈలో ప్రక్షాళన.. అంతర్గత బదిలీలు
ABN , First Publish Date - 2023-10-30T02:47:30+05:30 IST
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో అవినీతి పెరిగిపోవడంతో అధికారులు ప్రక్షాళన ప్రారంభించా రు. దాదాపు అన్ని సెక్షన్లలోనూ ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసేందుకు సిద్ధమయ్యారు.
అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో అవినీతి పెరిగిపోవడంతో అధికారులు ప్రక్షాళన ప్రారంభించా రు. దాదాపు అన్ని సెక్షన్లలోనూ ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మధ్యకాలంలో డీఎంఈ నర్సింగ్ విభాగంలో భారీ అవినీతి జరిగింది. పరీక్ష పత్రాల మూల్యాంకనంలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో నర్సింగ్ విభాగంలోని కొంత మంది సిబ్బందికి అధికారులు సెక్షన్లు మార్చారు. ఈ విభాగంలో మరికొంత మంది సిబ్బందిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. నర్సింగ్ విభాగంలో ప్రతి చిన్న పనికి కూడా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కాలేజీల క్లినికల్ అనుమతులు, ఇతరత్రా పనులకు కచ్చింతగా లంచాలు చెల్లిస్తేనే ఫైల్స్ ముందుకు కదులుతాయి. నర్సింగ్‌తో పాటు మరికొన్ని విభాగాలపై కూడా భారీగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిపై కూడా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ-11, ఈ-1, ప్లానింగ్ వంటి విభాగాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగులను మారుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా విభాగాల్లో ప్రతి ఆరు నెలలకొకసారి ఉద్యోగులను మారిస్తేనే పరిస్థితి కొంత మెరుగవుతుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.