చిరుధాన్యాల సాగుతో ఆర్థికంగా అభివృద్ధి

ABN , First Publish Date - 2023-02-02T00:56:55+05:30 IST

రైతులు కేవలం వరి, ఇతర వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాల సాగు చేయడం వల్లే ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు.

చిరుధాన్యాల సాగుతో  ఆర్థికంగా అభివృద్ధి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శివకుమార్‌

కొల్లిపర, ఫిబ్రవరి 1 : రైతులు కేవలం వరి, ఇతర వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాల సాగు చేయడం వల్లే ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. మండల పరిధిలోని చివలూరులో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ చిరుధాన్యాల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి ఏడీఏ వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శివకుమార్‌ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుకు మరింత చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. పూర్వం రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను సాగు చేసి వాటిని ఆహారంగా తీసుకోవడంతో మరింత ఆరోగ్యవంతంగా ఉన్నారన్నారు. చిరుధాన్యాల పోషక విలువలపై రైతులకు అవగాహన కలిగించి ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం కూడా చిరుధాన్యాల సాగును ప్రొత్సహిస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల్లో ప్రొటీన్స అధికంగా ఉంటాయని, వాటిని తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మార్కెట్‌ యార్డు చైర్మన అవుతు సీత, ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ బొంతు వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ నాంచారయ్య, జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు, ఉపవ్యవసాయ సంచాలకులు బాలునాయక్‌, రామాంజనేయులు, శాస్త్రవేత్త ప్రసాద్‌, డీపీఎం రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:57:00+05:30 IST