రేపటి నుంచి సీమలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-09-04T03:43:01+05:30 IST

‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో 45 రోజుల కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 5 నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు.

రేపటి నుంచి సీమలో చంద్రబాబు పర్యటన

అనంత, కర్నూలు జిల్లాల్లో ఐదు రోజుల కార్యక్రమాలు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో 45 రోజుల కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 5 నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 5న అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పర్యటన ప్రారంభం కానున్నది. ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ నుంచి బళ్లారి చేరుకుని, అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం 5, 6, 7 తేదీల్లో రాయదుర్గం, కల్యాణ దుర్గం, గుంతకల్‌ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తారు. రోడ్‌ షోలు, సభల్లో పాల్గొంటారు. 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం తెలిపింది.

Updated Date - 2023-09-04T03:43:01+05:30 IST