నమ్మకంగా ప్రజలను మోసం చేసిన జగన్‌

ABN , First Publish Date - 2023-06-07T00:46:04+05:30 IST

రాష్ట్ర ప్రజలను సీఎం జగన్‌ నమ్మకంగా మోసం చేశారని రైతులు, మహిళలు పేర్కొన్నారు.

నమ్మకంగా ప్రజలను మోసం చేసిన జగన్‌
మందడంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులు

తుళ్లూరు(తాడికొండ), జూన్‌ 6: రాష్ట్ర ప్రజలను సీఎం జగన్‌ నమ్మకంగా మోసం చేశారని రైతులు, మహిళలు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి-సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట రాజధాని గ్రామాల్లో రైతులు, రైతుకూలీలు, మహిళలు చేపట్టిన నిరసనలు మంగళవారానికి 1267వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ రాజధాని నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి వద్ద 200 ఎకరాల్లో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేసి వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల కోసం అమరావతిలో భూములు కొనుగోలు చేసిందని తెలిపారు. రాజధానిని మార్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుందన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభు త్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. న్యాయస్థానాలు కూడా రాజఽధానిని మార్చితే ప్రశ్నిస్తుందన్నారు. ఇప్పటికే హైకోర్టు రాజధానిని అభివృద్ధి చేయాలని తీర్పులు వెల్లడించిందన్నారు. ఇప్పటికే డీజీపీ, ఆర్‌అండ్‌బీ భవనాలు, సచివాలయం, అసెంబ్లీ, ఉద్యోగుల భవన నిర్మాణాలు పూరౖయ్యాయన్నారు. ప్రభుత్వానికి భూములు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియని మొరటోడు జగన్మోహనరెడ్డి అని అన్నారు. రాజధాని 29 గ్రామాలైన తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, దొండపాడు, పెదపరిమి, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Updated Date - 2023-06-07T00:46:04+05:30 IST