మూడు ముక్కలాటను ఇకనైనా కట్టిపెట్టాలి: రాజధాని రైతు మహిళలు

ABN , First Publish Date - 2023-03-26T00:09:28+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడుముక్కలాటను ఇక కట్టిపెట్టాలని రాజధాని రైతులు, మహిళలు హెచ్చరించారు.

మూడు ముక్కలాటను ఇకనైనా కట్టిపెట్టాలి: రాజధాని రైతు మహిళలు
నెక్కల్లు శిబిరంలో నిరసన దీక్షలో పాల్గొన్న రాజధాని మహిళలు, రైతులు

గుంటూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడుముక్కలాటను ఇక కట్టిపెట్టాలని రాజధాని రైతులు, మహిళలు హెచ్చరించారు. రాజధాని పరిరక్షణ కోసం చేపట్టిన ‘బిల్డ్‌ అమరావతి- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఉద్యమం శనివారం నాటికి 1194వ రోజుకు చేరింది. ఉద్యమంలో భాగంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళలు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానుల పేరిట సీఎం జగన్‌ మొదలుపెట్టిన మూడుముక్కలాటను కట్టిపెట్టాలని హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు కూడా మూడు రాజధానుల నాటకాన్ని తిప్పికొట్టారన్నారు. మూడు రాజధానుల సిద్ధాంతాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరించారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కోర్టు కేసుల్లో రుజువయిందని, ఇకనైనా అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-26T00:09:28+05:30 IST