క్యాన్సర్‌ నివారణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2023-03-27T00:28:09+05:30 IST

వేంకటరాయ-శ్రీధర్‌ ఫౌండేషన్‌ భవిష్యత్తులో క్యాన్సర్‌నివారణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాదు ఆకాంక్షించారు.

క్యాన్సర్‌ నివారణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ ప్రసాదు

వేంకటరాయ-శ్రీధర్‌ ఫౌండేషన్‌ ప్రారంభం

చిలకలూరిపేట,మార్చి26: వేంకటరాయ-శ్రీధర్‌ ఫౌండేషన్‌ భవిష్యత్తులో క్యాన్సర్‌నివారణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాదు ఆకాంక్షించారు. పట్టణం లోని నన్నపనేని వెంకటరత్నం కల్యాణ మండపంలో ఆదివారం వేంకట రాయ-శ్రీధర్‌ ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ తోటకూర వేంకటరాయలు, ఆయన కుమారుడు శ్రీధర్‌ క్యాన్సర్‌ తో చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు వారి సంస్మరణార్ధం ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రామకృష్ణ ప్రసాదు మాట్లాడుతూ ఈ ఫౌండేషన్‌ గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత భవిష్యత్తుకు మార్గనిర్దేశకత్వం వహించాలని సూచించారు. విశిష్ఠ అతిథిగా విచ్చే సిన సినీదర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోని వృత్తులన్నింటిలోను అధ్యాపక వృత్తి ఎంతో అత్యుత్తమమైం దని వేంకటరాయలు జీవితాంతం ఆవృత్తి ధర్మాన్ని పాటించారన్నారు. ప్రత్యేక అతిథి బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఆంకాలజీ - అనస్తీషియా చీఫ్‌ డాక్టర్‌ బసంత్‌కుమార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ నిర్మూలన ఉద్యమంలో ఈసంస్థ భాగస్వామ్యం కావడం అభినందనీ యమన్నారు. మరో ఆరు నెలల్లో బసవతారకం ఆస్పత్రి క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరువచేసే కృషిలో ఉందని, ఈ ఫౌండేషన్‌ చేయి కలిపితే మంచి ఫలితాలొస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ తేళ్ళ సుబ్బారావు, అసిస్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జాస్తి రంగారావు, ఫౌండేషన్‌ స్థాపకులు తోటకూర శ్రావణ్‌ శ్రీనివాస్‌, శిరీష చౌదరి, కార్యదర్శి వేంకట నారాయణ, రొటేరియన్‌ రవి కుమార్‌, విశ్రాంత అధ్యాపకులు తోటకూర ప్రభాకరరావు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా తోటకూర వేంకట రాయలు స్మృతులతో కూడిన సావనీరును జస్టిస్‌ రామకృష్ణ ప్రసాదు ఆవిష్కరించారు.

Updated Date - 2023-03-27T00:28:09+05:30 IST