అవినాశ్ ముందస్తు బెయిల్‌రద్దు చేయండి
ABN , First Publish Date - 2023-06-07T02:53:41+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు
సీబీఐ చూపించిన ఆధారాలను పట్టించుకోలేదు
సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్
న్యూఢిల్లీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు గత నెల 31న ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని.. ముఖ్యంగా సీబీఐ చూపించిన ఆధారాలను పట్టించుకోలేదని.. హైకోర్టు ఉత్తర్వుల్లో అనేక లోపాలు ఉన్నాయని అందులో ఆమె పేర్కొన్నట్లు సమాచారం. బుధవారం ఈ పిటిషన్‌ను ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌లో సీబీఐ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశాలున్నాయని న్యాయవాదులు అంటున్నారు.