స్వల్ప భూ ప్రకంపనలు

ABN , First Publish Date - 2023-02-20T00:52:12+05:30 IST

మండలంలోని చల్లగరిగ, గింజుపల్లి, మాదిపాడు, పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల్లో ఆదివారం ఉదయం 7:26 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది.

 స్వల్ప భూ ప్రకంపనలు

అచ్చంపేట, ఫిబ్రవరి 19 : మండలంలోని చల్లగరిగ, గింజుపల్లి, మాదిపాడు, పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల్లో ఆదివారం ఉదయం 7:26 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్ధంతో రెండు సెకెన్ల పాటు భూమి కంపిచినట్టు పై గ్రామాల ప్రజలు తెలిపారు. గతంలోనూ మాదిపాడు, జడపల్లి తండా తదితర గ్రామాల్లో భూక్రపంనలు రావటంతో గృహాల్లోని సామన్లు దొర్లినట్టు స్థానికులు తెలిపారు. భూకంప ప్రభావంతో ప్రజలు భయాందోళ నలకు గురయ్యారు. కృష్ణా నదిలో ఇసుక అఽధికంగా తోడి వేయటం తోనే నదీ తీర గ్రామాల్లో భూ ప్రకంపనలు వస్తున్నాయంటూ ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Updated Date - 2023-02-20T00:52:19+05:30 IST