AP income : రివర్స్ గేర్!
ABN , First Publish Date - 2023-05-26T02:36:23+05:30 IST
ఏపీలో ఉపాధి లేక ప్రజలు వలస వెళుతున్నారు. తాము వెళ్లిన రాష్ట్రాల్లో తమ కొనుగోళ్లు, ఇతర ఖర్చులను చేస్తుండటంతో మన జీఎస్టీ తగ్గిపోయింది. వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి పంచుతున్న డబ్బులు కూడా పక్కరాష్ట్రాల్లో ఖర్చవడంతో జీఎస్టీ విషయంలో ఏపీ.. పొరుగురాష్ట్రాలతో పోటీ పడలేక చతికిలపడింది.

ఆదాయంలో వెనుకబడిన రాష్ట్రం
తెలంగాణపై ఎనిమిదేళ్ల ఆధిక్యత ఢమాల్
జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో
తెలంగాణకంటే రూ.1067 కోట్లు తక్కువ
ఆ పద్దుల్లోనే తెలంగాణకు రూ.23 వేల కోట్లు
కేవలం 8 వేల కోట్ల పెరుగుదలతో ఏపీ చతికిల
జగన్ ఆర్థిక విధ్వంస విధానాలకు మూల్యం
రియల్ ఢమాల్.. నిర్మాణాలు నిల్..
ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు
ఏపీలో ఉపాధి లేక ప్రజలు వలస వెళుతున్నారు. తాము వెళ్లిన రాష్ట్రాల్లో తమ కొనుగోళ్లు, ఇతర ఖర్చులను చేస్తుండటంతో మన జీఎస్టీ తగ్గిపోయింది. వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి పంచుతున్న డబ్బులు కూడా పక్కరాష్ట్రాల్లో ఖర్చవడంతో జీఎస్టీ విషయంలో ఏపీ.. పొరుగురాష్ట్రాలతో పోటీ పడలేక చతికిలపడింది.
ఏపీకి రాజధాని లేకపోవడం, అమరావతిని సీఎం జగన్ చీల్చిచెండాడడంతో రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ రంగం ఢమాలైంది. దీంతో రిజిస్ర్టేషన్లు అనుకున్న స్థాయిలో పెరగలేదు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలను వైసీపీ ప్రభుత్వం తరిమికొట్టడం, కొత్త పరిశ్రమలేవీ రాకపోవడంతో అభివృద్ధి కార్యకలాపాల ఊసేలేకుండా పోయింది.
ఏపీలో లిక్కర్ రేటు ఎక్కువ. క్వాలిటీ తక్కువ. దీంతో పొరుగు మద్యంపై మద్యంప్రియులు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఏపీకి లిక్కర్ ఆదాయం తగ్గి, తెలంగాణకు పెరగడానికి ఇదే కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ రాష్ట్రంలో అవలంబిస్తున్న విధ్వంసకరమైన ఆర్థిక విధానాలకు ఇప్పుడు రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయంలో తొలిసారి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. ఒక్క ఏడాదిలోనే తెలంగాణ ఆదాయం రూ.24,000 కోట్లు పెరిగింది. ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్కో ఆర్థిక వనరును వైసీపీ తన స్వప్రయోజనాల కోసం నాశనం చేస్తూ వచ్చింది. దాని ఫలితమే ఎనిమిదేళ్లుగా తెలంగాణతో పోల్చితే ఆదాయంలో ముందంజలో ఉన్న ఏపీ....మొదటిసారి చతికిలపడింది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపిరినిచ్చే జీఎస్టీ, అమ్మకపు పన్ను, రిజిస్ర్టేషన్ల ఆదాయం తెలంగాణతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గాయి. మొత్తంగా చూస్తే 2022-23లో ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.1067 కోట్లు పెరిగింది. కాగ్ నివేదికల ప్రకారం, 2021-22లో తెలంగాణకు రూ.1,27,468 కోట్ల ఆదాయం వచ్చింది.
ఏపీకి రూ.150,552 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2022-23లో తెలంగాణ ఆదాయం రూ.23,084 కోట్లు పెరిగి 1.59349 లక్షల కోట్లకు చేరుకుంది. ఏపీ ఆదాయం కేవలం రూ.8,000 కోట్లు పెరిగి రూ.1,58282 కోట్లకు మాత్రమే పరిమితమైంది. పైగా 2022-23లో కేంద్రం నుంచి ఏపీకి రూ.36,048 కోట్ల గ్రాంట్లు వచ్చాయి. తెలంగాణకి కేవలం రూ.13,179 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ కంటే ఏపీకి రూ.22,869 కోట్లు ఎ క్కువగా వచ్చాయి. అయినప్పటికీ మొత్తం ఆదాయంలో తెలంగాణ కంటే ఏపీ వెనుకబడడం వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న అస్తవ్యస్థ విధానాలకు తార్కాణం.
జీఎస్టీ: 2021-22లో తెలంగాణకు జీఎస్టీ రూపంలో 34,489 కోట్లు రాగా ఏపీకి రూ.34,262 కోట్లు వచ్చింది. 2022-23లో తెలంగాణ జీఎస్టీ రూ.41,888 కోట్లకు పెరగ్గా, ఏపీ జీఎస్టీ రూ.38,840 కోట్ల వద్దే ఆగిపోయింది.
అమ్మకపు పన్ను:
అమ్మకపు పన్నులో ఏపీ భారీగా వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్, లి క్కర్‌పై అ మ్మకపు పన్ను ద్వారా తెలంగాణ రూ.29,604 కోట్లు సాధించగా ఏపీకి కేవలం రూ.18,004 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది కూడా 2021-22లో ఏపీ సాధించిన అ మ్మకపు పన్ను కంటే రూ.2900 కోట్లు తక్కువ. జగన్ సర్కార్ అవలంబిస్తున్న లిక్కర్ విధానం, పెట్రోల్, డీజిల్‌పై అమలు చేస్తున్న అదనపు వ్యాట్, సెస్‌లే ఇందుకు కారణం. ఏపీలో అన్ని రకాల లి క్కర్ బ్రాండ్లు దొరకకపోవడంతో మందుబాబులు పొరుగు రాష్ట్రాలపై ఆ సక్తి చూపుతున్నారు. తెలంగాణలో అమ్ముతున్న ప్రతీ లిక్కర్ బ్రాండ్ ఏపీలో కూడా దొరుకుతోంది కాబట్టే ఏపీకి లిక్కర్ ఆదాయం తగ్గి, తెలంగాణకి పెరిగిందని ఆర్థిక శాఖ అధికారులు విశ్లేషించారు. 2022-23లో తెలంగాణకు లిక్కర్‌పై రూ.18470 కోట్ల పన్ను వచ్చింది. ఏపీకి రూ.14,798 కోట్లు మాత్రమే వచ్చింది. లిక్కర్ ఆదాయంపై గత నాలుగేళ్ల నుంచి గణాంకాలు ఇలాగే ఉన్నాయి. జగన్ అవలంబిస్తున్న లిక్కర్ విధానం వల్లే ఖజానాకు ఆదాయం తగ్గి తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతోంది. అలాగే, పెట్రోల్, డీజిల్‌పై పొరుగు రాష్ట్రాల్లో లేనివిధంగా ఏపీలోనే అదనంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 4 రూపాయల వ్యాట్, రూపాయి సెస్ వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పెట్రోల్, డీజిల్ ఆదాయం కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. అందుకే ఏపీలో అె్ముకపు పన్ను ఆదాయం భారీగా తగ్గింది
రిజిస్ర్టేషన్ల ఆదాయం:
స్టాంపులు రిజిస్ర్టేషన్ల ఆదాయంలో తెలంగాణతో పోల్చితే ఏపీ పరిస్థితి బేజారుగా ఉంది. 2022-23లో రిజిస్ర్టేషన్ల ద్వారా ఏపీకి రూ.8,022 కోట్ల ఆదాయం రాగా తెలంగాణకు రూ.14,228 కోట్ల ఆదాయం వచ్చింది. 2021-22తో పోల్చితే తెలంగాణ రిజిస్ర్టేషన్ల ఆదాయం రూ.2,000 కోట్లు పెరగ్గా, ఏపీ ఆదాయం కేవలం రూ.400 కోట్లు మాత్రమే పెరిగింది.
బాదుడులో ముందు.
చెత్తపన్ను, మరుగుదొడ్ల పన్ను, ఆస్తిపన్ను, ఇంటిపన్ను పెంపు, ఓటీఎస్, పెట్రోల్, డీజిల్ సెస్, రోడ్డు అభివృద్ధి సెస్ లాంటి పన్నులేసి జనాలను బాదడంలో జగన్ ప్రభుత్వం ముందుంది. అన్ని ఆదాయ మార్గాల్లోనూ ఏపీ కంటే తెలంగాణ ముందంజలో ఉండగా ఇ లాంటి బాదుడు పన్నుల్లో మాత్రం వైసీపీ ప్రభుత్వమే ముందుంది. 2022-23లో ఇలాంటి బాదుడు ద్వారా ఏపీకి రూ.9109 కోట్ల ఆదాయం రాగా, తెలంగాణకు రూ.8,430 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అలాగే, ప్రభుత్వ భూముల అ మ్మకం ద్వారా తెలంగాణకు 2022-23లో రూ.19,553 కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది. ఏపీలో కూడా ప్రభుత్వ భూములు అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం 2021లో మిషన్ ఏపీ బిల్డ్‌ను ప్రారంభించినప్పటికీ దీనికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. దీంతో అ వే భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీ వడ్డీకి వేల కోట్ల అప్పులు తెచ్చింది జగన్ ప్రభుత్వం. 2022-23లో ఏపీకి రూ.6031 కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది.
ఆర్థిక ఏపీ తెలంగాణ
సంవత్సరం ఆదాయం ఆదాయం
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
2014-15 65695 51042
2015-16 88648 76134
2016-17 98994 82818
2017-18 10506 88824
2018-19 114684 101420
2019-20 111034 102544
2020-21 117136 99903
2021-22 150552 127468
2022-23 158282 159349