స్టిక్కర్లు ఇళ్లకెందుకు.. ఎమ్మెల్యేలే పచ్చబొట్లు వేయించుకోండి..

ABN , First Publish Date - 2023-05-27T00:55:07+05:30 IST

జగనన్నా నీ మీదే మా నమ్మకమన్నా.. అంటూ ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై లేని ప్రేమను నింపుతూ స్టిక్కర్లు అంటించే బదులు ఎమ్మెల్యేలే పచ్చబొట్లు వేసుకుంటే బాగుండేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఎద్దేవా చేశారు.

స్టిక్కర్లు ఇళ్లకెందుకు.. ఎమ్మెల్యేలే పచ్చబొట్లు వేయించుకోండి..
మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

తెనాలి రూరల్‌, మే 26: జగనన్నా నీ మీదే మా నమ్మకమన్నా.. అంటూ ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై లేని ప్రేమను నింపుతూ స్టిక్కర్లు అంటించే బదులు ఎమ్మెల్యేలే పచ్చబొట్లు వేసుకుంటే బాగుండేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షే మం అంటూ అందులో దోపిడీకి తెరలేపిన జగన్‌ ప్రభుత్వం 175 స్థానాలు సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిచేయకపోగా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని తామే చేశామంటూ పేర్లుమార్చి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ తరపున పోటీచేసే ఏ నాయకుడైనా దమ్ము.. ధైర్యం ఉంటే పచ్చబొట్టు వేయించుకుని పోటీచేయాలని సవాల్‌ చేశారు. అమరావతి రైతులను ఇబ్బందులు పెడుతూ రాజధాని లేకుండా పాలన సాగిస్తూ, యువతకు ఉపాధి కల్పించకపోగా, ఇసుక కొరతతో కార్మికుల పొట్టకొట్టి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ 175 స్థానాలంటూ మాట్లాడటానికి సిగ్గుండాలని అన్నారు. లోకల్‌ లోకల్‌ అని చెప్పుకునే ఎమ్మెల్యే లోకల్‌లో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. మట్టి నుండి ఇటుక వరకూ అంతా కమీషనేనన్నారు. కేబుల్‌ను సైతం వదలని నేత లోకల్‌ లోకనాఽథమని ఆరోపించారు. గ్రామాల్లో ఆర్చ్‌లు, విగ్రహాలు పెట్టడం తప్ప ఆయన ప్రజలకు చేసిన మంచి ఏంటో చెప్పాలన్నారు. టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తే చంద్రబాబుకు మంచిపేరువస్తుందని లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ఓ చేత్తో ఇస్తూ నాలుగుచేతులతో లాక్కునే ప్రభుత్వాన్ని సాగనంపే రోజుకోసం ప్రజలు కాచుకుని ఉన్నారని హెచ్చరించారు. పలువురు పార్టీనాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:55:07+05:30 IST