8 రోజులు.. 43 గంటలు.. 27 బిల్లులు

ABN , First Publish Date - 2023-03-25T03:09:42+05:30 IST

ఈ నెల 15న ప్రారంభమైన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ బడ్జెట్‌ సమావేశాల గణాంకాలను వెల్లడించారు.

8 రోజులు.. 43 గంటలు.. 27 బిల్లులు

ముగిసిన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 15న ప్రారంభమైన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ బడ్జెట్‌ సమావేశాల గణాంకాలను వెల్లడించారు. 8 రోజులపాటు జరిగిన ఈ 15వ శాసనసభ 10వ సమావేశాల్లో మొత్తం 43 గంటల 12 నిమిషాలపాటు సభ జరిగిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 బిల్లులు సభలో ఆమోదం పొందాయని వివరించారు. 69 స్టార్‌ ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు ఇవ్వగా.. మరో 29 స్టార్‌, 2 అన్‌స్టార్‌ ప్రశ్నలకు సభ ముందు ఉంచారని, 2 షార్ట్‌ నోట్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా టీపీకే రామాచార్యులు నియమితులైనట్లు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. నూతన కార్యదర్శి రామాచార్యులును సభకు పరిచయం చేశారు.

Updated Date - 2023-03-25T03:09:42+05:30 IST