27,590 ఇంజనీరింగ్ సీట్లు మిగులు
ABN , First Publish Date - 2023-09-22T03:55:17+05:30 IST
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ముగిసింది. కన్వీనర్ కోటాలో 27,590 సీట్లు మిగిలిపోయాయి.
ముగిసిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ముగిసింది. కన్వీనర్ కోటాలో 27,590 సీట్లు మిగిలిపోయాయి. తాజాగా జరిగిన తుది కౌన్సెలింగ్‌లో 9,120 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి గురువారం ప్రకటించారు. తుది కౌన్సెలింగ్‌లో 50,378 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకోగా, అందులో 9,120 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. ఇప్పటికే పొందిన అడ్మిషన్లలో 20,202 మంది మార్పులు చేసుకున్నారు. అన్ని విడతల్లో కలిపి 254 కాలేజీల్లో 1,21,997 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా 94,407 సీట్లు భర్తీ అయ్యాయి. 26 యూనివర్సిటీ కాలేజీల్లో 5,513 సీట్లు భర్తీ కాగా, 2,018 మిగిలిపోయాయి. 222 ప్రైవేటు కాలేజీల్లో 85,111 భర్తీకాగా 25,232 మిగిలాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో 3,783 భర్తీకాగా 340 మిగిలిపోయాయి.