ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-07-29T08:01:07+05:30 IST

ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాదుకా మండపం ముందున్న టీ స్టాల్‌లో మంటలు చెలరేగాయి.

ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

ఏలూరు : ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాదుకా మండపం ముందున్న టీ స్టాల్‌లో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మంటల్లో టీ స్టాల్ సామాగ్రి కాలి బూడిదైంది. పాదుకా మండపంపై నిద్రిస్తున్న భక్తులు భయంతో పరుగు తీశారు. భీమడోలు ఫైర్ సిబ్బందిహుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.

Updated Date - 2023-07-29T08:01:07+05:30 IST