భూ సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-03-02T00:04:38+05:30 IST

సమగ్ర భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ సరిహద్దు రాళ్లు నిబంఽధనల ప్రకారం ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవో ఎన్‌వీ.సత్యనారాయణ ఆదేశించారు. బు ధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సరిహద్దు రాళ్లు ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఆయన మా

భూ సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో

జడ్పీ సీఈవో సత్యనారాయణ

పెదపూడి, మార్చి 1: సమగ్ర భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ సరిహద్దు రాళ్లు నిబంఽధనల ప్రకారం ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవో ఎన్‌వీ.సత్యనారాయణ ఆదేశించారు. బు ధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సరిహద్దు రాళ్లు ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతు భూమి సరిహద్దుల వద్ద ఏర్పాటు చేయడానికి మండలానికి 13,707 రాళ్లు వచ్చాయన్నారు. సరిహద్దు రాళ్లు ఏ,బి అను రెండు కేటగిరీలుగా ఉం టాయన్నారు. వీటిలో ఏ- కేటగిరి రాళ్లు గ్రామా సరిహద్దులను, బి- కేటగిరి రాళ్లు రైతు పొలాల సరిహద్దులను సూచిస్తాయని తెలిపారు. పెదపూడి మండలంలో మూడు బృందాలు పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 520 సరిహద్దు రాళ్లు ఏర్పాటు జరిగిందన్నారు. సరిహద్దు రాళ్లు ఏర్పాటు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. ఎంపీపీ కేతా తులసి, జడ్పీటీసీ పేపకాయల వెం కటరమణ, ఎంపీడీవో పి.విజయభాస్కర్‌, తహశీల్దార్‌ టి.సుభాష్‌, ఈవోపీఆర్‌డీ కే.హరికృష్ణ సత్యరెడ్డి, మండల సర్వేయర్‌ రమ్యశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:04:38+05:30 IST