యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-06-26T23:49:42+05:30 IST

యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని ము మ్మిడివరం సీఐ ఎన్‌.కొండయ్య, ఎస్‌ఈబీ సీఐ ఎన్‌ఎస్‌ వేణుమాధవ్‌ పేర్కొన్నారు.

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ, అవగాహన సదస్సులు

ముమ్మిడివరం, జూన్‌ 26: యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని ము మ్మిడివరం సీఐ ఎన్‌.కొండయ్య, ఎస్‌ఈబీ సీఐ ఎన్‌ఎస్‌ వేణుమాధవ్‌ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ మాదక ద్రవ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరంలోని ఎస్‌ఈ బీ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు, ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా ర్థులు మత్తు పదార్ధాలకు బానిసై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్‌ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందిం చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. టోల్‌ ఫ్రీ నెం.14500కు సమాచారం అందించాలన్నారు. అనం తరం విద్యార్థులతో కాశివానితూము సెంటర్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఐ కె.సురేష్‌బాబు, ఎస్‌ఈబీ ఎస్‌ఐ సీహెచ్‌ రాజేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల ర్యాలీ

రామచంద్రపురం: పట్టణంలో గల పలు కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యవంతుల ను చేశారు. పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ స్థానిక రాజగోపాల్‌ సెంటర్‌ వరకూ ర్యాలీని కొనసాగించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పె క్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై వారి ఉజ్వల భవిష్యత్‌ను నాఽశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాలీలో మోడరన్‌ జూనియర్‌ కళాశాల, వికాస్‌, నారా యణ, వి.ఎస్‌.ఎం కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఎస్‌ఐ ఇ.రవికుమార్‌, మోడరన్‌ కళాశాల కరస్పాండెంట్‌ లయ న్‌. జి.వి.రావు, పట్టణ సీఐ వి.దుర్గారావు, ఎస్‌ఐ డి. సురేష్‌బాబు, అడిషనల్‌ ఎస్‌ఐ ఆచారి, ఎస్‌ఈబీ శాఖ సిబ్బంది, కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

రాజోలు: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విశ్రాంత ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజోలు ఉన్నత పాఠశాలలో జొన్నలగడ్డ వెంకటసు బ్బారావు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థు లకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి సోమవారం ఆయన అవగా హన కల్పించారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం రేకపల్లి అంబ, జి.సుబ్బరాజు, ఎం.గణపతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మామిడికుదురు: యువత మాదకద్రవ్యాలకు దూరం గా ఉండాలని నగరం ఎస్‌ఐ షేక్‌ జానీబాషా కోరారు. సోమవారం మామిడికుదురు దీప్తి కళాశాలలో అంతర్జాతీ య మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించు కుని యువతను ఉద్ధేశించి మాట్లాడారు. డ్రగ్స్‌ బారిన పడమని తమకు మాట ఇవ్వాలని విద్యార్థినీ విద్యార్థులచే ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో కళాశాల కర స్పాండెంట్‌ డీవీవీ సత్యనారాయణ, అడబాల ఈశ్వరరా వు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మండపేట: మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలకు యు వత దూరంగా ఉండాలని మండపేట ప్రభుత్వ డీగ్రీకళా శాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, మండపేట పట్టణ ఎస్‌.ఐ కె.అప్పారావు, ఆలమూరు ఎక్సైజ్‌ సీఐ అరుణకుమారి, ఎస్‌.ఐ. రాంబాబులు పిలుపునిచ్చారు,. మాదకద్రవ్య వ్యతి రేక దినోత్సవంను పురష్కరించుకుని సోమవారం మండ పేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ జూని యర్‌ కళాశాలతోపాటు ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

చిన్నారులు వినూత్న ప్రచారం

ఆత్రేయపురం: మెర్లపాలెం ఫౌండేషన్‌స్కూల్లో చిన్నా రులు తమ చిట్టి చేతులతో ‘మాదకద్రవ్యాలు వద్దు... ఆరో గ్యం ముద్దు’ అంటూ గులకరాళ్లను అక్షరాలుగా చేశారు. మాదకద్రవ్యాల వినియోగంతో చేకూరే అనర్ధాలను చి న్నారుల ద్వారా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో చేపట్టినట్టు ఉపాధ్యాయుడు చింతా శ్యామ్‌ తెలిపారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారించాలి

అమలాపురం టౌన్‌: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ను నివారించడం ద్వారా వినియోగాన్ని తగ్గించవచ్చని, అందుకు ప్రజలంతా కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక పిలుపునిచ్చింది. అమలాపురం యూటీఎఫ్‌ హోంలో జిల్లాశాఖ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఇఆర్‌ సుబ్రహ్మణ్యం అ ధ్యక్షతన అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్స వం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కేవీవీ సత్యనారా యణ, ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, పి.భాస్కరరా వు, బీఎన్‌ వెంకటేశ్వరరావు, మూర్తి పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలకు వ్యతిరేక ర్యాలీ

కొత్తపేట: వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సెబ్‌ ఎస్‌ఐ కె. అన్న వరం మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాత బస్టాండు సెంటర్లో మానవహారం నిర్మించి మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వైస్‌ ప్రిన్సిపల్‌ ఎస్‌.అరుణకుమార్‌, ఎస్‌ఈబీ సిబ్బంది ఐ.ఆనందరావు, బీవీకే వర్మ, ఎస్‌.ఏసుప్రభు పాల్గొన్నారు.

యానాం: యానాం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా యానాం పరిపాలనాధికారి మునిస్వామి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం యానాం పూరవీధుల్లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలతో, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.యానాం ఎస్పీ రఘునాయగం, ఎస్‌ఐ శేరు నూకరాజు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ పువ్వల వీరఽభద్రస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:49:42+05:30 IST