వైసీపీకి ఓటేస్తే మెడకు ఉరితాడే
ABN , First Publish Date - 2023-03-11T01:06:38+05:30 IST
వైసీపీకి ఓటేస్తే మీ మెడకు మీరే ఉరితాడు బిగించుకున్నట్టే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని న్యాయవాదులు, నిరుద్యోగ యువతతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు
కొవ్వూరు, మార్చి 10: వైసీపీకి ఓటేస్తే మీ మెడకు మీరే ఉరితాడు బిగించుకున్నట్టే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని న్యాయవాదులు, నిరుద్యోగ యువతతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీబీఎన్ కనెక్ట్ అనే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు జూమ్‌లో రాష్ట్రంలోని న్యాయవాదులతో నేరుగా మాట్లాడారు. కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో న్యాయవాదులు, నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం చట్ట వ్యతిరేక దుర్మార్గపు ప్రభుత్వం పాలిస్తోందని, ఇటువంటి పాలన చూస్తామనుకుంటే తాను కూడా న్యాయ విద్యను అభ్యసించేవాడినన్నారు. ఎకనామిక్స్ చదవడంతో దూరదృష్టితో విజన్ 2020 పేరుతో సంపద సృష్టించడానికి బాటలు వేశామని, వాటి ఫలాలలనే నేడు అనుభవిస్తున్నామన్నారు. ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రణాళికను తయారుచేసి అమలు చేద్దామన్నారు. ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రభావితం చేసే విద్యార్ధులను తయారుచేయాలన్నారు. కార్యక్రమంలో యువత మండల సెక్రటరీ పసలపూడి హరిబాబు, న్యాయవాదులు ఐవీ రమణమూర్తి, ఏలూరి గోపాలకృష్ణ, కోడూరి రాఘవులు, బందెల సువర్ణరాజు, ఎం.చక్రపాణి, మర్రి వెంకటేష్, రాజాన శ్రీనివాస్, కాకర్ల సత్తిబాబు, టీడీపీ పట్టణ, మండలాధ్యక్షులు దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, నామానా పరమేశ్వరరావు, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, యలమాటి సత్యనారాయణ పాల్గొన్నారు.