Share News

వైసీపీ అరాచక పాలనపై తిరగబడుదాం

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:16 AM

వైసీపీ అరాచక పాలనపై మనమంతా తిరగబడాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

 వైసీపీ అరాచక పాలనపై తిరగబడుదాం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17: వైసీపీ అరాచక పాలనపై మనమంతా తిరగబడాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం 44వ డివిజన్‌లో టీడీపీ నాయకులు శంకర్‌, జవ్వాది మురళి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, జనసేన సిటీ ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షడు వై.శ్రీనులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ జగన్‌కు ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాడని ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదని, నిత్యావసరాల ధరలు, బస్సుచార్జీలు, కరెం ట్‌ చార్జీలు పెరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. టీడీపీ-జనసేన కూటమిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ,జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 01:16 AM